• 8 years ago
In a crime plot straight out of a film, a woman and her boyfriend allegedly murdered her husband and disfigured the boyfriend so that he can impersonate the husband and take possession of his assets.

ప్రియుడు రాజేష్ సహాయంతో భర్తను చంపేసిన స్వాతి విచారణలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించిందని తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోరం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
పోలీసులు స్వాతిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండుకు తరలించారు. పోలీసుల విచారణలో ఆమె ఎన్నో విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆమె చెబుతున్న విషయాలు విని పోలీసులు షాకయ్యారని సమాచారం.
తనకు రెండేళ్లుగా రాజేష్‌తో పరిచయం ఉందని తన భర్తను చంపడానికి నాలుగు రోజుల ముందు ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసినట్లు చెప్పింది. రూ.10 లక్షలతో ప్రియుడు రాజేష్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి సిద్ధపడింది. రాజేష్‌కు తన భర్త రూపు వచ్చాక పుణేకు చెక్కేద్దామని స్వాతి ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది.ఇందుకోసం అతనిపై యాసిడ్ దాడి చేసి ఆసుపత్రిలో చేర్పించింది. తమ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని భావించి, కోడలికి మనోధైర్యాన్ని ఇచ్చారు సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కానీ వారికి ఓ సమయంలో అనుమానం వచ్చింది.
సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే వారికి బలవర్దక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారని, రాజేష్‌కు కూడా ఆసుపత్రి వర్గాలు మటన్ సూప్‌ను ఇవ్వబోగా ఆయన దాన్ని నిరాకరించాడని చెప్పారు.
మాంసాహారి అయిన సుధాకర్ మటన్ సూప్‌ను బలవంతం చేయబోయినా ముట్టక పోవడంతో వారికి మొదటిసారి అనుమానం వచ్చింది అని పోలీసుల పిర్యాదు లో తెలిపారు.

Category

🗞
News

Recommended