• 7 years ago
Veteran actor Mohan Babu's comeback film 'Gayatri' has been creating a lot of buzz in Tollywood ever since it went on floors. First look, Trailers, Teasers goes viral in social media. Now This movie released on Feb 9th. Telugu filmibeat brings exclusively review of Gayatri

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తనదైన శైలిలో మాటల తూటలు, నటన రుచి చూపించి చాలా రోజులైంది. టాలీవుడ్‌ తెరపై మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి మోహన్‌బాబు చేసిన ప్రయత్నం గాయత్రి. టైటిల్‌తోనే మంచి రెస్పాన్స్ సంపాదించుకొన్న మంచు ఫ్యామిలీ.. టీజర్లు, ట్రైలర్లతో అలరించింది. దాంతో గాయత్రి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకొందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
శివాజీ (మోహన్‌బాబు) రంగస్థల నటుడు. అనాథలను ఆదరించి పెంచి పోషిస్తుంటాడు. పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రుల వద్దకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకొంటాడు. తప్పిపోయిన తన కూతురు గాయత్రి (నిఖిల్ విమల) కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో తన కూతురు కలుసుకొంటాడు. కానీ గాయత్రికి తండ్రి అంటే అసహ్యం భావం తెలుస్తుంది. అంతేకాకుండా రౌటీషీటర్ గాయత్రి పటేల్ (మోహన్‌బాబు)తో వైరం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో శివాజీకి మరణ శిక్ష పడుతుంది.
తన భార్య శారద (శ్రీయ సరన్)‌కు శివాజీ ఎందుకు దూరమయ్యాడు? కూతురు ఎలా తప్పిపోయింది? గాయత్రి పటేల్‌ ఏ విధంగా గుణపాఠం చెప్పాడు? మరణశిక్ష నుంచి శివాజీ ఎలా తప్పించుకొంటాడు. తనపై కూతురుకు ఉన్న చెడు అభిప్రాయాన్ని ఎలా తొలగించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే గాయత్రి చిత్ర కథ.
గాయత్రి బలమైన సెంటిమెంట్, అనేక కమర్షియల్ అంశాలు ఉన్న కథ. తొలి భాగంలో శివాజీ భావోద్వేగాలతో సినిమా నడుస్తుంది. శివాజీ నాటకరంగంపైనే కాకుండా నిజజీవితంలో కూడా నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చేందనే పాయింట్‌ను బలంగా చెప్పడానికి చేసిన జైలు సంఘటన అంతగా ఆకట్టుకునేలా ఉండదు. తొలిభాగంలో పేలవమైన సన్నివేశాలు కథను బలహీనంగా మార్చాయనే ఫీలింగ్ కలుగుతుంది. హనుమాన్ పాట, కూతురు కలుసుకోబోతున్నాననే సంతోషంలో వచ్చే పాటలు ఫీల్‌గుడ్‌తో వెళ్తున్న సినిమాకు కళ్లెం వేశాయనే అనిపిస్తుంది. శివాజీ యువకుడి (మంచు విష్ణు) కథను ఫ్లాష్‌బ్యాక్‌తో ఆరంభంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

Recommended