South superstar Varun Tej and actress Raashi Khanna's latest outing 'Tholi Prema' has hit the screens on February 9, 2018. The Telugu romantic drama is directed by debutant Venky Atluri and produced by B V S N Prasad. The film also stars Sapan Pabbi, Priyadarshi Pullikonda, Suhasini Maniratnam, Vidyullekha Raman and Hyper aadhi. Telugu filmibeat brings review exclusively.
ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి తొలిసారి దర్వకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అయింది. వరుణ్, రాశీఖన్నాల కెమిస్ట్రీ తెరపైన ఏ విధంగా వర్కవుట్ అయింది? వరుణ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఆదిత్య శేఖర్ (వరుణ్ తేజ్) మనసుకు నచ్చింది చేసే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న యువకుడు. ట్రైయిన్‌లో వర్ష (రాశీఖన్నా) తారసపడిన మరుక్షణమే తొలి ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీలో చేరుతారు. అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో ఓ కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆరేళ్లకు లండన్‌లో కలుసుకొంటారు.
ఎంతో గాఢంగా ప్రేమించుకొన్న ఆదిత్య, వర్ష విడిపోవడానికి బలమైన కారణమేమిటి? పీకల్లోతు కోపంతో ఉన్న ఆదిత్య వర్ష మళ్లీ కలుసుకొన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? వారి మధ్య విభేదాలు, కోపతాపాలు తగ్గి మళ్లీ ఒక్కటైపోవడానికి ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు వారి జీవితంలో చోటుచేసుకొన్నాయి. ఆదిత్యపై ప్రేమను రుజువు చేసుకోవడానికి వర్ష ఏ విధంగా స్పందించింది. వర్షపై తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆదిత్య ఏమి చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే తొలిప్రేమ కథ.
వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఓ ఇగో కారణంగా వరుణ, రాశీ విడిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
సెకండాఫ్‌లో బ్రేకప్ మెమోరీస్ నుంచి బయటపడటానికి ఆదిత్య లండన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని తన ప్రాణస్నేహితుడు ప్రియదర్శితో, ఇతర స్నేహితులతో ఉద్యోగంలో చేరిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదిత్య జీవితంలోకి వర్ష మళ్లీ ప్రవేశిస్తుంది. వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించి ఒక్కటవ్వడం ద్వారా సినిమా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో ముగుస్తుంది.

Category
🎥
Short film