తొలిప్రేమ ఎఫెక్ట్ : ఎన్టీఆర్ మూవీ నుంచి అనిరుధ్ అవుట్

  • 7 years ago
Thaman replace with Anirudh for NTR movie. At first, Anirudh was roped in for this movie as Trivikram was impressed with his work for Agnathavasi. but after Agnathavasi flop ntr changed his decision. Cinematographer Natarajan Subramaniam also out of the project.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ లో ఇంకా గందరగోళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. అజ్ఞాతవాసి చిత్రం తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ లెక్కలు సరిచేసుకునే పనిలో ఉన్నారని, మొత్తంగా ఈ సినిమానే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని వార్తలు వచ్చాయి. అంతలోనే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ మీడియాలో లీకులు. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా గురించిన వార్తలు ఆగడం లేదు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మార్పు అనివార్యం అని తేలిపోయింది. ఈ మేరకు ప్రధాన మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో థమన్ ని తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం అజ్ఞాతవాసి విడుదలకంటే ముందుగా పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది. ఈ ఈవెంట్ కు అనిరుద్ కూడా హాజరయ్యాడు. ఎన్టీఆర్ కు తగ్గ సంగీతాన్ని అనిరుద్ అందించగలడని మొదట త్రివిక్రమ్ బలంగా నమ్మాడు.
అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించాడు. వేగవంతంగా ఈ యువ సంగీత దర్శకుడు పాపులర్ అయ్యాడు. అనిరుద్ అందిస్తున్న బాణీలు సరికొత్తగా వినసొంపుగా ఉండడంతో త్రివిక్రమ్ పట్టు బట్టి మరి అనిరుద్ ని అజ్ఞాతవాసి కోసం చేర్చుకున్నాడు.
అజ్ఞాతవాసి చిత్రం నిరాశ పరచడంతో ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడని, అనిరుద్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ కు సూచించనినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
అనిరుధ్ స్థానంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న థమన్ ని ఎంపిక చేశారు. థమన్ ఇటీవల కొన్ని చిత్రాలకు అద్భుతమైన సంగీతాని అందించాడు.
ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రానికి థమన్ ది బెస్ట్ మ్యూజిక్ ని అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సంగీతం విషయంలో థమన్ ని అభినందించాల్సిందే. తొలిప్రేమ చిత్రంలో థమన్ సంగీత ప్రభావం అంతలా ఉంది.

Recommended