• 6 years ago
Before marrying Bonney Kapoor, Sridevi was linked to her co-star Jeetendra after they worked together in films like Himmatwalla, Jaani Dost and Justice Choudhary. After reading the rumours about her affair with Jeetendra, Sridevi gave a very shocking interview to a leading magazine in the year 1984, in which she said that she will not marry a married man.

బాలీవుడ్ నిర్మాత బోనికపూర్‌ను వివాహం చేసుకోక ముందు చాలా మంది హీరోలతో శ్రీదేవికి అఫైర్ ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చేవి. అలాంటి కోవలోనే జితేంద్రతో కూడా అఫైర్ ఉన్నట్టు వార్తలు అప్పట్లో వార్తలు షికారు చేశాయి. హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత జితేంద్రతోనే ఎక్కువ సినిమాలు చేసింది శ్రీదేవి. వారిద్దరూ కలిసి నటించిన హిమ్మత్‌వాలా, జానీదోస్త్, జస్టిస్ చౌదరీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
అగ్రతారగా శ్రీదేవి కొనసాగుతుండగా ఓ మ్యాగజైన్‌కు శ్రీదేవి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించింది.
జితేంద్రతో రిలేషన్‌షిప్ గురించి ఒకనొక సందర్భంలో శ్రీదేవి మాట్లాడుతూ.. జితేంద్ర చాలా మంచి మనిషి. హిందీలో నా తొలి రోజు షూటింగ్‌లో ఆయన అందించిన సహకారం మరువలేను. హిందీ కొత్త భాష కావడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికే హిందీలో తొలి సినిమా సోల్వా సావన్ సరిగా ఆడలేదు. ఆ సమయంలో నాకు నైతిక మద్దతివ్వడమే కాదు.. నాలో నమ్మకాన్ని నింపారు అని శ్రీదేవీ వెల్లడించింది.
నేను ఆయన కలిసి ఓకే గదిలో ఉన్నామని వార్తలో వాస్తవం లేదు. అతను నా గదికి గానీ, ఇంటికి గానీ రాలేదు. మా గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారని నాకు తెలుసు. ఎవరెన్నీ మాట్లాడుకున్నా వాస్తవమేమిటో నాకు తెలుసు. దానిని ఎవరూ మార్చలేరు.
నేను అమాయకురాలినే కావొచ్చు. కానీ నేను తెలివి తక్కువ దానిని కాదు. మనిషిని, హోదాను బట్టి మసులుకునే వ్యక్తిని కాదు. నేను మనుషులను వాడుకునే వదిలేసే వ్యక్తిని అసలే కాదు
ఇతరులతో సంబంధాలు అంటగట్టే వార్తలు నాకు కొత్తేమీ కాదు. అలాంటి వార్తలను చూసి నేను ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలనే అనుభవం నాకు బాగానే ఉంది. సినీ పరిశ్రమ అంటే ఇలా ఉంటుందో నా తల్లిదండ్రులు ముందే నేర్పించారు. అఫైర్ వార్తలను పట్టించుకోకుండా జితేంద్రను, ఆయన భార్యను, వారి కుటుంబాన్నితరుచుగా కలుసుకొనే దానిని అని శ్రీదేవి వెల్లడించారు.

Recommended