• 7 years ago
Gautami daughter will going to romance with Dhruv.

కమల్ హాసన్ తో విడిపోయాక సీనియర్ నటి గౌతమి తన కుమార్తె సుబ్బలక్షితో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. గౌతమి కుమార్తె సుబ్బ లక్ష్మి సినీరంగ ప్రవేశం త్వరలో ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ గౌతమి తన కుమార్తెని లాంచ్ చేయడనికి సరైన చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఆ తరుణం ఆసన్నం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
విక్రమ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు ధృవ్ ని ఇంకొన్ని రోజులు ఆగాక సినిమాల్లోకి లాంచ్ చేయాలనీ భావించాను. కానీ అర్జున్ రెడ్డి చిత్రం చూసాక తన నిర్ణయం మార్చుకున్నట్లు విక్రమ్ తెలిపాడు. ధృవ్ కి తొలి మూవీగా అర్జున్ రెడ్డి సరైన చిత్రం అని తాను భావించినట్లు విక్రమ్ తెలిపారు.
అర్జున్ రెడ్డి రీమేక్ హక్కులు పలు భాషల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. టాలీవుడ్ లో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది మరి.
ఈ చిత్రంలో హీరోయిన్ గా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి పేరు పరిశీలిస్తున్న తెలుస్తోంది. గౌతమి కూడా తన కుమార్తెని ఈ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు కాస్త ఘాటుగానే ఉంటాయి. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్, షాలిని పాండే మధ్య ముద్దు సన్నివేశాలు ఘాటుగా ఉంటాయి. ఆ తరహా సన్నివేశాలలో తొలి చిత్రంలోనే నటించాలంటే కాస్త ఆలోచిస్తారు. ఇక గౌతమి వంటి సీనియర్ హీరోయిన్ కుమార్తె నటిస్తోందంటే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడం ఖాయం. కానీ ఇలాంటి వారికి భయపడకుండా తన కుమార్తెని వర్మ చిత్రంలో నటింపజేసేందుకు గౌతమి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recommended