బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలది ఒక్కటే ఎజెండా !

  • 6 years ago
TDP chief Chandrababu Naidu suggested to TDP MPs to coordinate with other party leaders in the parliament. The TDP believes that the Speaker would not take up the no-trust motion if there was no order in the Lok Sabha.

బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలది ఒక్కటే ఎజెండా అని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ఇతర పార్టీల నేతలతో సమన్వయం చేసుకోవాలని టిడిపి ఎంపీలకు బాబు సూచించారు. మంగళవారం నాడు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో టెటికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్ లో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.
పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. అవిశ్వాస తీర్మానానికి సహకరించేలా అన్ని పార్టీలను ఒప్పించాలని బాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఆయా పార్టీలతో కూడ అవిశ్వాసంపై నోటీసులు ఇప్పించాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపై కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా టిడిపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే కొన్ని పార్టీలు టిడిపిపై బురద చల్లుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ, జనసేన, బిజెపిలపై బాబు విమర్శలు గుప్పించారు.
సమయం, సందర్భాన్ని బట్టి వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కుట్రలను ఎదుర్కోవడంలో తెలుగు ప్రజలు రాటు దేలారు. కుట్రలను ఎదుర్కోవడం తెలుగువారికి కొత్తకాదని చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాటం చేస్తోంటే యుద్దం చేస్తున్నారని కేంద్రం ఆరోపించడం సరికాదన్నారు.

Recommended