• 7 years ago
Tiger Shroff and Disha Patani are rumored to be dating each other, but the actress has called him "bhai" (brother) in an Instagram post. Tiger and his rumored lady love Disha have been busy promoting their upcoming movie Baaghi 2. While sharing a moment from one such promotional activities, Disha called the actor "bhai".

వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన దిశా పటానీ...ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. బాలీవుడ్లో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఈ ముంబై బ్యూటీ 'బాగీ 2' అనే చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తోంది. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ చాలా కాలంగా క్లోజ్‌గా మూవ్ అవుతోంది. ఇద్దరూ కలిసి ముంబైలో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి.
చాలా కాలంగా రూమర్స్ వస్తున్నా ఎన్నడూ వీరు స్పందించలేదు. అయితే తాజాగా దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో టైగర్ ష్రాఫ్‌ను 'భాయ్'(అన్నయ్యా) అని సంబోధించడంతో అంతా షాకయ్యారు. 'బాగీ 2' ప్రమోషన్లో భాగంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు.
దీనిపై టైటర్ ష్రాఫ్ స్పందిస్తూ... 'మేమిద్దరం కలిసి లంచ్, డిన్నర్‌కు వెళ్లడం వల్ల మామీద రకరకాల ప్రచారం జరిగింది. మేం చేస్తున్న 'బాగీ 2' సినిమా చుట్టూ బజ్ క్రియేట్ అయింది.
అందుకే ఇంతకాలం ఈ వార్తలపై సైలెంటుగా ఉన్నాం. కలిసి లంచ్, డిన్నర్ వెళ్లినంత మాత్రాన మేము డేటింగులో ఉన్నట్లు భావించడం సరికాదు. దిశా చాలా హార్డ్ వర్కర్, సినిమాకు ఎంతో కష్టపడి పని చేసింది. ఆమె తనకు మంచి స్నేహితురాలు' అని తెలిపారు.

Category

🎵
Music

Recommended