Allu Arjun's movie Duvvada Jagannadham got 10crore views for it's hindi dubbing version. Director Harish Shankar shared this in twitter.
అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన డీజే(దువ్వాడ జగన్నాథమ్) గతేడాది విడుదలై మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద డివైట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో సత్తా చాటింది. బన్నీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా దుమ్మురేపుతోంది.
గోల్డ్ మైన్స్ టెలీ ఫిలింస్ యూట్యూబ్ చానల్ ద్వారా 'డీజే' సినిమాను యూట్యూబ్‌లో రెండు నెలల క్రితం అప్‌లోడ్ చేశారు. కేవలం 71రోజుల్లోనే ఈ సినిమాకు పదికోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', వంటి వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ ఖాతాలో'డీజే' మరో హిట్చిత్రంగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.
డీజేలో బన్నీ తొలిసారిగా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడి పాత్రలో కనిపించారు. అన్యాయాన్ని సహించని యువకుడి పాత్రలో బన్నీ నటన ఆకట్టుకుంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీష్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

Category
🎥
Short film