• 7 years ago

దండుపాళ్యం సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. త్వరలో దండుపాళ్యం-4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి 'దండుపాళ్యం' మొదటి,రెండు,మూడు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందుతోంది.
సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దండును తయారు చేసే పాత్తను బెనర్జీ పోషించారు. వెంకట్ మూవీస్ పతాకంపై కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే తాను ఈ చిత్రం లో పోషిస్తున్న పాత్ర షూటింగ్ పూర్తయిందని, నటుడిగా తనకిదో వైవిధ్యమైన పాత్ర అని బెనర్జీ తెలిపారు. గత చిత్రాలకన్నా భిన్నంగా 'దండుపాళ్యం-4' రూపొందుతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రం లో తమ దండు చేసే పోరాటాలు,తన పాత్ర తో సహా, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రం లోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. మంచి విజన్ వున్న దర్శకుడు కె.టి.నాయక్ . నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పతాక సన్నివేశాలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. నిస్సందేహంగా ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర ప్రశంసలకు గురవుతుందని ఆయన తెలిపారు.

Recommended