• 6 years ago
Andhra Pradesh minister Bhuma akhila Priya engagement has done with Bhargav held in Hyderabad.
#BhumaAkhilaPriya
#Hyderabad
#Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం భార్గవ్‌తో ఘనంగా జరిగింది. ఆమె కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడే ఈ భార్గవ్. మంత్రి నారాయణకు కూడా భార్గవ్ బంధువేనని తెలిసింది. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే వీరి నిశ్చితార్థం అఖిలప్రియ, భార్గవ్ కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. వీరి వివాహం ఆగస్టు 29న నిశ్చయించినట్లు తెలిసింది.
తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన అఖిలప్రియ అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆమె పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
రాజకీయపరంగా సవాళ్లు ఎదురవుతున్నా.. తల్లిదండ్రుల్లానే ధైర్యంగా రాజకీయ వ్యవహారాలను అఖిలప్రియ చక్కబెడుతున్నారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రజలే తన కుటుంబసభ్యులని చెబుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, అఖిలకు ఇప్పటికే వివాహం జరిగినప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.

Category

🗞
News

Recommended