• 6 years ago
Actress Madhavi Latha Speaks On Chikago Issue

టాలీవుడ్ చిత్రపరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నిటి వరకు కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ ని కుదిపేసింది. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో జరుగుతున్న ప్రతి అంశం గురించి తన అభిప్రాయం వివరించే మాధవీలత.. ఈ సెక్స్ రాకెట్ గురించి కూడా స్పందించింది.
తాను 2017 లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లానని మాధవీలత తెలిపింది. ఈవెంట్ కోఆర్డినేటర్లుగా కిషన్, చంద్ర ఉన్నారని తెలిపింది. అక్కడ జరుగుతున్న పరిణామాల అనుమానంగా ఉండడంతో తన జాగ్రత్తల్లో తాను ఉన్నానని మాధవీలత తెలిపింది.
అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి బయట చెబుతానేమోనని భయంతో తనని దాదాపు హౌస్ అరెస్ట్ చేసినంత పని చేసారని మాధవీలత తెలిపింది. తాను తీవ్రమైన మెడనొప్పితో భాదపడ్డప్పటికీ కనీసం చికిత్స కూడా చేయించలేదని మాధవీలత తెలిపింది.
ఆ సమయంలో తాను అమెరికాలో 20 రోజులు గడిపినట్లు మాధవీలత తెలిపింది. అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఇక జీవితంలో అలాంటి ఈవెంట్స్ కు వెల్ళకూడదని నిర్ణయించుకున్నట్లు మాధవీలత తెలిపింది.
చికాగో సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న హీరోయిన్లు, ఇతర అమ్మాయిలదే తప్పు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మాధవీలత మండిపడింది. హీరోయిన్లు డాలర్స్ సంపాదించుకునే ఉద్దేశంతో, పరస్పర అవగాహనతోనే వెళుతున్నారనే ముద్ర వేస్తున్నారు.

Recommended