• 7 years ago
CM Chandrababu said that the Center asking queries about the Kadapa steel plant again and again for delay.
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#teleconference

కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ పైన టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయనతో వారు కడప స్టీల్ ప్లాంట్ విషయమై భేటీ అయిన విషంయ తెలిసిందే. కేంద్రమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ మాటలు చెప్పించారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్‌తో మాట్లాడమని చెప్పినా వినలేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ రాజకీయంతో ముడివడిన అంశమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిందేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఢిల్లీలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తాము ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపామన్నారు. రేపు (గురువారం) మళ్లీ కేంద్రమంత్రిని కలుస్తామని చెప్పారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం అడిగిన ప్రశ్నలే రెండు మూడు సార్లు అడుగుతూ కాలయాపన చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలోని ఎంపీలతో, కడప ఉక్కు దీక్ష నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొన్నటిదాకా తెలంగాణ పరిశ్రమపై స్పష్టత రాలేదని, బయ్యారం భూములు, నీళ్ల వివరాలు అందాల్సి ఉందని చెప్పుకొచ్చారని, ఇప్పుడు ఉక్కు దీక్ష మొదలయ్యాక మరో రెండు కొత్త కొర్రీలు వేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయాలపై కేంద్రానికి వెంటనే మరో లేఖను రాస్తానని, గురువారం భేటీలో ఆ లేఖను అందించాలని ఎంపీలకు సిఎం చంద్రబాబు సూచించారు.
కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న డిమాండుతో గత ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎం రమేష్‌, బీటెక్‌ రవిల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన హామీ రాబట్టుకోవడానికి టిడిపి పార్లమెంటరీ పార్టీ బృందం మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిసింది. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ నాలుగు పేజీల వినతి పత్రం సమర్పించింది. ఈ విషయమై సుమారు గంటన్నరపాటు ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు.

Category

🗞
News

Recommended