• 7 years ago
దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ 11 మంది ఆత్మహత్య కేసులో మరో కొత్త అంశం వెలుగు చూసింది. 50 ఏళ్ల వయస్సున్న భవనేష్ భాటియా చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేశాడు. అతను తన చేతిని గొంతు వద్ద పెట్టుకొనే ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో అతను చివరి నిమిషంలో బతకాలనుకున్నట్లుగా భావిస్తున్నారు. 11 కుటుంబ సభ్యులు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో భవనేష్ ఆత్మహత్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి రావడం గమనార్హం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో దాని పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు.

Further investigations in the Delhi Burari deaths case have revealed that at least one of the deceased out of eleven members of Bhatia family of Sant Nagar in Burari, made a last-minute bid to escape the hanging but was unsuccessful.
#delhi
#burarikillings
#masssuicide
#superstitions

Category

🗞
News

Recommended