Karnataka Bundh Has No Effect In Bangalore.There is dull response to the karnataka bandh called for demanding waiving of formers loan. Protests are being held at some district where BJP has strong hold.
#karnatakabandh
#BJP
రైతుల రుణమాఫి చెయ్యాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మే 28 సోమవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పంధన వచ్చింది. ఎప్పటిలాగే ప్రజలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులు సంచరిస్తున్నాయి. అన్ని షాపులు తీశారు. వ్యాపారలావాదేవీలు కొనసాగుతున్నాయి. బంద్ కు ప్రజలు ఎదురుతిరగడంతో బీజేపీ నాయకులు నిరాశకు గురైనారు.
బీజేపీ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో షాపులు మూతపడ్డాయి. బీజేపీ కార్యకర్తలు కేఎస్ఆర్ టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. బలవంతంగా షాపులుమూయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన చిక్కబళ్లాపుర, కోలారు జిల్లాల్లో బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఎప్పటిలాగే బస్సులు సంచరిస్తున్నాయి. వ్యాపారలావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎప్పటిలాగే సంచరిస్తున్నారు.
హెచ్.డి. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్ లో బంద్ ప్రభావం ఏమాత్రం కనపడటం లేదు. కేఎస్ఆర్ టీసీ బస్సులు, ఆటోలు సంచరిస్తున్నాయి. తుమకూరు జిల్లాలో సైతం బంద్ ప్రభావం కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు నిరాశకు గురైనారు.

Category
🗞
News