• 6 years ago
(35) registered a 5-0 win in the 48-kg category over Hanna Okhota of Ukraine to tie with Cuban legend Felix Savon’s haul he won all his six medals in the men’s heavyweight division.
#MaryKom
#SixthGoldMedal
#WomensWorldBoxing
#championships
#Record


భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి బంగారు పతకం సాధించింది. దీంతో అత్యధిక సార్లు ఈ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళా బాక్సర్‌గా మేరీ చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్లో 35 ఏళ్ల మేరీ కోమ్.. ఉక్రెయిన్‌ బాక్సర్ హన్నా ఒఖోటాను ఓడించింది. 48 కేజీలో విభాగంలో పోటీపడిన మేరీ కోమ్.. ఫైనల్‌లో 5-0 తేడాతో విజయం సాధించింది. న్యూ ఢిల్లీలో భారత అభిమానుల మధ్యలో బంగారు పతకం గెలవడం మేరీ కోమ్‌కు ఇది రెండోసారి. గతంలో న్యూఢిల్లీలో 2006లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ బంగారు పతకం సొంతం చేసుకుంది.

Category

🥇
Sports

Recommended