• 7 years ago
Karnataka Elections Later Kumaraswamy Wife Became A Hot Topic .Kumaraswamy wife Radhika trending in social media. She acted in more than 30 films
కుమారస్వామి భార్య రాధిక గురించి మాట్లాడుకునేముందు కన్నడ రాజకీయాల గురించి ఓ విషయం ప్రస్తావించాలి. వందకు పైగా స్థానాలు కైవసం చేసుకున్న బిజెపికి, 70కి పైగా స్థానాలు గెలుచుకున్నా కాంగ్రెస్ కు దక్కని అవకాశం కేవలం 38 స్థానాలు గెలుచుకున్న కుమారస్వామికి దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్న కుమారస్వామి హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉంచితే ఆయన భార్య రాధికా కూడా జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం విశేషం. సోషల్ మీడియాలో నెటిజన్లు రాధికా గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు ఆమె అందాల హీరోయిన్. తెలుగు సహా పలు దక్షణాది చిత్రాలలో ఆమె నటించింది.
రాధిక 32 చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. రాధికా నటించిన తొలి తెలుగు చిత్రం భద్రాద్రి రాముడు. నందమూరి హీరో తారకరత్న నటించిన ఈ చిత్రం 2004 లో విడుదలయింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రాధికకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.సినిమాలలో నటిస్తున్న తరుణంలో కుమారస్వామితో రాధికకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2006 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరో వివాహం అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరికి వయసులో వ్యత్యాసం 17 ఏళ్ళు కావడం విశేషం. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది.

Recommended