• 3 years ago
Gold medalist Neeraj Chopra has accomplished number 2 rank in the World Athletics ranking after his sensational show in the Tokyo Olympics.
#NeerajChopra
#TokyoOlympics
#javelin
#WorldAthleticsRankings
#Olympics
#Athletics
#AIF

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం గెలుచుకున్న నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజా ప్రపంచ అథ్లెటిక్‌ ర్యాంకింగ్స్‌లో పురుషుల జావెలిన్‌త్రో విభాగంలో రెండో స్థానంలో నిలిచారు.అతడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకడం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అతడు 16వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించడం నీరజ్ కెరీర్‌నే మార్చేసింది. ఫైనల్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో నీరజ్ 1315 పాయింట్లతో జర్మనీ స్టార్ జావెలిన్ త్రోయర్ జోహనెస్ వెటర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. జోహనెస్ వెటర్ 1396 మొత్తం స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు.

Category

🥇
Sports

Recommended