• 6 years ago
The trailer of Oviya's upcoming flick 90ML is out and has invited a lot of trolls

హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఈ షో తర్వాత ఓవియా నటిస్తున్న తొలి చిత్రం 90 ఎంఎల్. ఈ చిత్రానికి అనిత ఉదీప్ దర్శకురాలు. ఈ చిత్రానికి తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. ఓవియా తన అభిమానులందరికి షాక్ ఇస్తూ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించింది.

Recommended