Skip to playerSkip to main contentSkip to footer
  • 9/10/2019
Jai Jai Ganesha Video Song from Sirivennela movie.
#JaiJaiGanesha
#Priyamani
#BabySaiTejaswini
#Mahanati
#Sirivennela

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో తనదైన నటనతో, విభిన్నమైన పాత్రలతో మెప్పించిన డస్కీ బ్యూటీ ప్రియమణి. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకున్న ఆమె ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో కమల్ బోరా, ఏ.ఎన్.భాషా, రామ సీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు జూనియర్ మహానటిగా మంచి పేరు తెచ్చుకున్న బాలనటి సాయి తేజస్విని కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా సాయి తేజస్విని లుక్‌ను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Recommended