• 8 years ago
Baahubali Prabhas and Kattappa Satyaraj has good releations. Their journey started with Mirchi movie and it reached to Peak with Baahubali. In this situation Satya Raj asked a advice Prabhas about Telugu Kshanam movie into Tamil remake.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డైలాగ్. కేవలం సినిమా రంగానికే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రశ్నకు అనూహ్యమైన స్పందన వచ్చింది. బాహుబలి చిత్రంలో బ్రహ్మండమైన జోడిగా నిలిచిన ప్రభాస్, సత్యరాజ్‌కు నిజ జీవితంలో మంచి సంబంధాలున్నాయనే విషయం తాజా సంఘటనతో రుజువైంది. ప్రభాస్ మాటను తప్పకుండా పాటించానని సత్యరాజ్ చెప్పిన మీడియాలో ప్రముఖంగా మారింది. ఎంతకీ ఏమైందంటే..
కొరటాల శివ రూపొందించిన మిర్చి చిత్రంతో సత్యరాజ్‌తో ప్రభాస్ బంధం మొదలైంది. ఆ తర్వాత బాహుబలితో వారి రిలేషన్ పీక్స్ చేరింది. కేవలం వారి రిలేషన్ వ్యక్తిగతం అనుకుంటే పొరపాటే. వృత్తిపరంగా కూడా వారి మధ్య మంచి సంబంధాలున్నట్టు స్పష్టమైంది.
రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనను కట్టప్ప సత్యరాజ్ మీడియాకు ఇటీవల వెల్లడించారు. బాహుబలి సినిమా షూటింగ్‌లో మేమంత బిజీగా ఉన్నాం. అప్పుడు నా కుమారుడు శిబిరాజ్ నాకు ఫోన్ చేసి తెలుగులో విజయం సాధించిన క్షణం గురించి చెప్పాడు. ఆ సినిమా గురించి ప్రభాస్‌ను అడిగితే మంచి రెస్పాన్స్ ఇచ్చాడు.

Recommended