• 5 years ago
Defence Minister Rajnath Singh on Tuesday officially received the first Rafale fighter jet made for India by the French company Dassault. The minister, who is on a three-day visit to France, attended the handover ceremony along with his French counterpart Florence Parly at aircraft maker Dassault Aviation facility in Merignac, southwestern France. Rajnath Singh performed a Shastra Puja on the new aircraft as he emblazoned it with an 'Om' tilak and laid flowers and coconut, just before he was to take off in it for a sortie in the newly-acquired two-seater jet.
#RajnathSingh
#ShastraPuja
#RafaleAircraft
#rafaleaircraftdeal
#rafaleaircraftprice
#rafalejetfeatures


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజయదశమి నాడు ఫ్రాన్స్ లో తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ డసాల్ట్ ఏవియేషన్ సంస్థలో రాఫెల్ విమానానికి హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయుధ పూజను చేశారు. కుంకుమతో ఓం అనే అక్షరాన్ని దిద్దారు. దిష్టి కోసం కొబ్బరికాయను కట్టారు. అక్షింతలు చల్లారు. యుద్ధ విమానం టైర్ల కింద నిమ్మకాయలను ఉంచారు. కొద్దిసేపటి తరువాత అందులో విహరించారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 59 వేల కోట్ల రూపాయలు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసి భారత్ కు అందించేలా ఒప్పందం కుదిరింది. మిగిలిన యుద్ధ విమానాలు 2022 నాటికి తయారవుతాయి. అనంతరం వాటిని లాంఛనప్రాయంగా వైమానిక దళంలో ఇండక్ట్ చేస్తారు. విజయదశమి నాడే వైమానిక దళం 87వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడం, అదే రోజు రాఫెల్ తొలి యుద్ధ విమానం అందుకోవడం ఆనందంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

Category

🗞
News

Recommended