• 8 years ago
Pawan Kalyan's latest movie is Agnathavasi. This movie set to release on January 2018. Meanwhile, huge preparatons are for Agnathavasi audio is on card. Reports suggest that Victory Venkatesh to be appear as guest in this movie.

ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల వార్తల హవా కొనసాగుతున్నది. రాజమౌళి-రాంచరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజ్ తరుణ్-శర్వానంద్, కృష్ణవంశీ-మాధవన్ లాంటి హీరోలు జోడీ కట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసిలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారనే వార్త వెలుగుచూడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త నిజమైనా కావొచ్చు. ఎందుకంటే పవన్, వెంకీల మధ్య మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా త్రివిక్రమ్ తదుపరి చిత్రంలో వెంకీ నటిస్తున్నాడు. క్రేజీ కోసం ఇలా గెస్ట్ అప్పీయరెన్స్‌ను ప్లాన్ చేసి ఉండవచ్చు అనే మాట వినిపిస్తున్నది.
గతంలో వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటించారు. వారిద్దరు కనిపించిన గోపాల గోపాల చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒకవేళ అజ్ఞాతవాసిలో వెంకటేష్ నటిస్తే సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం ఉంది. మరి ‘అజ్ఞాతవాసి'లో వెంకటేష్‌ నిజంగా నటించారా? లేక గాసిపా? ఒకవేళ నటిస్తే వెంకీ ఏ పాత్రలో నటించాడు అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది.

Recommended