Skip to playerSkip to main contentSkip to footer
  • 11/5/2021
Virat Kohli Birthday: Virat Kohli’s Inspiration Journey, Incredible Records Held by Team India’s Run Machine
#ViratKohliBirthday
#ViratKohliRecords
#T20Worldcup
#IPL
#RCB
#ViratKohliJourney
#RunMachine

కోహ్లీ ఏ క్రికెటర్‌ పలకరింపు కోసం ఎదురు చూశాడో ఆ క్రికెటర్‌తో ఆడటమే కాకుండా అతని నుంచి ప్రశంసలు పొందాడు. ఇలా అతను ఆరాధ్య దైవంగా భావించిన.. ఒక్కసారైన చూడాలనుకున్న క్రికెటర్లందరితోను ఆడటమే కాక వారి మన్ననలు పొందాడు.జట్టు కోసం నిరంతరం తపిస్తూ, చెమట చిందిస్తూ ఆడే అతనికి ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్ గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అదే అతని కెరీర్‌కు లోటుగా మిగిలిపోయింది.భారత జట్టులో స్థానం కోల్పోవడం పట్ల విరాట్‌లో అంతర్మథనం మొదలైంది. తన తప్పులు ఏమిటో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు తనుకు ఉన్న తేడా ఏమిటో గమనించాడు. ఫిట్‌నెస్‌ ఉంటేనే క్రికెట్‌లో రాణించగలమని గ్రహించాడు. వెంటనే తన రూపాన్ని మార్చాలని బరువు తగ్గి ఫిట్‌నెస్‌ సాధించాడు.

Category

🥇
Sports

Recommended