ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఓ కారు విజయనగరం - పార్వతీపురం రహదారిపై ప్రమాదానికి గురైంది. దత్తిరాజేరు మండలం షికారుగండి కూడలిలో జాతీయరహదారి పక్కన ఉన్న కల్వర్ట్ దగ్గర అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. అయితే కారులోని మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులకు గంజాయి పార్సిళ్లు కనిపించాయి . కారు ఎక్కడ నుంచి వచ్చింది..మృతులపై వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Category
🗞
News