Nizamabad జిల్లాలో ప్రాజెక్టులు జళకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల్లో జలాశయాల్లో నీటి పరవళ్లు కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీకి భారీగా వరదనీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టుపైకి పర్యాటకులను అనుమతించటం లేదు. 20 గేట్లు ఎత్తి నీటిని అధికారులు కిందకి విడుదల చేస్తున్నారు. గేట్ల నుంచి కిందకు దుముకుతున్న నీటిని చూసేందుకు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు భారీగా చేరుకుంటున్నారు.
Category
🗞
News