Chess ప్రపంచంలో Magnus carlsen ఓ ఐకాన్. ప్రస్తుతం అతడి హవా నడుస్తోంది. మహా మహా ఆటగాళ్లే అతడిని నిలువరించలేక చతికిల పడుతున్నారు. అలాంటిది పెద్దగా అనుభవం లేని, 16 ఏళ్ల భారత Grandmaster Pragnananda .. కార్ల్‌సన్‌కు ఓటమి రుచి చూపించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను వరుస గేమ్స్‌లో ఓడించాడు. మియామీలో జరుగుతోన్న FTX క్రిప్టో కప్‌లో భాగంగా బ్లిట్జ్ ప్లే ఆఫ్ రౌండ్‌లో వరుసగా మూడుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఇప్పుడే కాదు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ టోర్నీలోనూ తొలిసారి కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Anand, Harikrishna తర్వాత కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.
Category
🗞
News