• 3 years ago
రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం పాతబస్తీలో ఇంకా రగులుతూనే ఉంది. ఆ కాంట్రవర్సీ చుట్టూ రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికులు ఆందోళనలు, ర్యాలీలతో పాతబస్తీని హోరెత్తిస్తున్నారు. దీంతో..పరిస్థితులు అదుపు తప్పకుండా పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐనా.. అర్ధరాత్రి దాటిన తరువాత ఆందోళనకారులు రోడ్డెక్కారు. శాలిబండ చౌరస్తా వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనలు, ర్యాలీలు చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వ్యాన్ ల్లోకి ఎక్కించారు.అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో.. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

Category

🗞
News

Recommended