ఈ తరం మేటి క్రికెటర్స్ లో ఒకడు.. విరాట్ కోహ్లీ. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. సచిన్ రికార్డులు చెరిపేస్తాడేమో అనేంతలా అదరగొట్టాడు. ఐతే.. గత కొంతకాలంగా ఫామ్ లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్ లో, కాదు ఈ మ్యాచ్ లో కచ్చితంగా కింగ్ కోహ్లి.. సెంచరీ కొడతాడు అనుకున్న ప్రతిసారీ అభిమానుల ఆశలు నీరుగారుతూనే ఉన్నాయి. ఐతే.. కోహ్లీ అభిమానులారా..! ఊపిరి పీల్చుకోండి. ఎలాగైనా ఆసియా కప్ లో ఫామ్ అందిపుచ్చుకునేందుకు విరాట్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అభిమానులకు ఊరటనిచ్చేలా.. విమర్శకులకు చెక్ పెట్టేలా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Category
🗞
News