కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అగ్రనేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఈ రోజు రాజీనామా చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన జీ-23 గ్రూప్ కు హెడ్ గా వ్యవహరించారు.. ఆజాద్. దీంతో.. ఈయన రాజ్యసభ కాలం ముగియడంతో.. కాంగ్రెస్ మళ్లీ నామినేట్ చేయలేదు. అప్పటి నుంచే.. కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు.
Category
🗞
News