హైదరాబాద్ ఓల్డ్ సిటీలో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. అయినప్పటికీ పోలీసులు పహారా కొనసాగుతూనే ఉంది. ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. కానీ ముందుజాగ్రత్త చర్యగా కీలక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్సు దళాలు మోహరించారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలు లేదు కానీ ప్రజలు గుమిగూడవద్దని, ప్రదర్శనలు చేయవద్దని పోలీసులు కోరారు.
Category
🗞
News