ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాం, మీ షాప్ లో బంగారం లెక్కల్లో తేడాలున్నాయంటూ 8 మంది ముఠా నెల్లూరులో హల్ చల్ చేసింది. మండపాల వీధిలోని ఓ షాపులో దూరి వారిని బయటకు పోనీయకుండా అడ్డుకున్నారు. 2-3 షాపుల్లో ఇలానే బెదిరించి 12 కిలోల బంగారాన్ని మూటగట్టుకునేందుకు ప్రయత్నించారు. గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వారిని నకిలీగా నిర్ధరించి అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Category
🗞
News