లండన్​లో ఘనంగా బోనాల వేడుకలు - హాజరైన ఎన్​ఆర్​ఐలు

  • 2 months ago
Bonalu Celebrations In London : లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ - టాక్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు యు.కె నలుమూలల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ హాజరయ్యారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు. స్వదేశంలో నిర్వహించేటట్లుగానే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Recommended