• 2 months ago
IRREGULAR SWEET SHOPS IN AMEERPET : హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని పలు స్వీట్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. పేరున్న స్వీట్స్ షాప్స్​తో సహా చాలా దుకాణాలు ఫుడ్ సేప్టీ నిబంధనలు పాచించడం లేదని గుర్తించారు. అమీర్​పేటలో ఫేమస్ అయిన వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్.. సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని తనిఖీల్లో తేలింది. స్వీట్ షాప్‌లో అమ్మే వస్తువులకు ఎలాంటి లెబెల్, ఎక్స్‌పైరీ డేట్‌ లేదని అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్‌లో మిఠాయిలు తయారు చేస్తున్న సమయంలో హెడ్‌ కాప్స్‌, యాప్రాన్స్‌ ధరించలేదని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్ తేదీ గడువు ముగిసినా రెన్యూవల్ చేయించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Category

🗞
News
Transcript
01:00You

Recommended