Sunrays Touching Shiva Lingam : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఉన్న శ్రీ స్వయం భూ శంబూ లింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులతో స్వయం భూ శంబు లింగేశ్వర స్వామి వారు కాంతులీనారు. మహాశివ రాత్రికి నాలుగు రోజుల ముందే స్వామివారిని సూర్యకిరణాలు తాకడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారిని సూర్యకిరణాలు తాకినాయని ఆలయ అధికారులు వివరించారు.
Category
🗞
News