• 5 years ago
తమిళనాడు రాజధాని చెన్నై తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి వింత వెలుగులు కనిపించాయి. తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులకు కనువిందు చేశాయి. హోరుమని శబ్దం చేస్తూ తీరానికి చేరుకునే అలలు నీలం రంగులో మెరిసిపోయాయి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో నీటి అలలు నీలంరంగులో మెరిసిపోవడాన్ని వింతగా తిలకించారు చెన్నై వాసులు. తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు. నీలం రంగును సంతరించుకున్న అలలను తమ సెల్ కెమెరాల్లో బంధించారు. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను ఆశ్యర్యానికి గురి చేసింది.

Category

🗞
News

Recommended