• 6 years ago
Director Ram Gopal Varma is creating sensation by making GST, and its trailer was released the other day.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా దేశ వ్యాప్తంగా దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. వర్మ తీసిన ఈ నగ్న చిత్రంపై ఓ టీవీ ఛానల్ వారు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో కొందరు కాలేజీ అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వర్మను తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఎందుకు తీశారు? ఇండియాలో ఎవరూ ఒప్పుకోలేదా? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ..... ‘ఇండియాలో నగ్నంగా నటించడానికి ఎవరూ ఒప్పుకోరు. పోర్న్ స్టార్ అయితేనే నేను అనుకున్నది తీయగలను అనే ఉద్దేశ్యంతో మియా మాల్కోవాను ఎన్నుకోవడం జరిగింది. ఇండియాలో ఇలాంటి సీన్లు తీయడానికి చట్టం ఒప్పుకోదు. అందుకే యూరఫ్‌లో ఈ ఫిల్మ్ చిత్రీకరించడం జరిగింది అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
యూరఫ్ లో షూట్ చేసి ఇండియాలో చూపించవచ్చా? అనే ప్రశ్నకు వర్మ బదులిస్తూ..... నేను నా ఫిల్మ్ డిజిటల్ వరల్డ్ లో, చూసే వారికి చూపిస్తున్నాను. డిజిటల్ వరల్డ్‌కు రీజియన్ తో సంబంధం లేదు. ఎవరు ఎక్కడి నుండైనా చూడవచ్చు అని వర్మ తెలిపారు.

Recommended