Skip to playerSkip to main contentSkip to footer
  • 4/1/2025
Durga Malleswara Swamy Temple Vasanta Navaratrulu at Indrakeeladri of Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రుల్లో మూడవ రోజు రోజున పసుపు, తెలుపు చామంతులు, మల్లె పూలతో అమ్మ వారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. నట రాజ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో పుష్పార్చన చేశారు. ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొని వచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మ వారిని దర్శించు కున్నారు. జపాన్ దేశానికి చెందిన టోక్యో నగరానికి చెందిన ఇద్దరు విదేశీ మహిళలు దుర్గమ్మ వారి పుష్పార్చనలో పాల్గొన్నారు. విజయవాడ సందర్శనలో భాగంగా దుర్గమ్మ వారికి ఈ పర్వదినాలలో నిర్వహించే ప్రత్యేక పూజలు, అమ్మవారి మహిమలు గురించి స్థానికుల నుండి తెలుసుకొని వచ్చి, పుష్పార్చనలో పాల్గొన్నట్లు తెలిపారు. 

Category

🗞
News

Recommended