Mallareddy Dances in Holi Celebrations : కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా సక్సెస్ అయ్యా అనే డైలాగ్ వినగానే మనకు యాదికొచ్చే ఒకే ఒక్క పేరు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డియే. తన మాటలు, చేష్టలు, ప్రసంగాలతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తారు. ఆ మధ్య ఎన్నికలకు ముందు గొర్రెలను కాస్తూ ఒక డైలాగ్ చెప్పారు. కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, ఇప్పుడు గొర్రెలు కాస్తున్నానంటూ గొర్రెలు కాస్తున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అయింది.
మల్లారెడ్డి మాటలనే పాటలుగా తీసుకుంటూ కొందరు డీజేలైతే ఏకంగా రీమేక్ చేసేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం, ఇతరుల్లో నింపే ఆ జోష్‌నే వేరు. పండుగ, పెళ్లి, ఏదైనా ఓపెనింగ్, పార్టీ సభ, కళాశాలలో ఏదైనా ప్రోగ్రాం పెట్టిన అక్కడ మల్లారెడ్డి ఉంటే ఆ ఊపే వేరు. విద్యార్థులకైతే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన స్టేజ్ ఎక్కుతున్నారంటే ఓ ఊపున్న పాట వేసి ఆయన స్టెప్లు వేయడమే కాకుండా మిగతా వారితోనూ డ్యాన్స్‌లు చేయించే రకం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.
హోలీ సంబురాల్లో మల్లారెడ్డి డ్యాన్స్ : ఇప్పుడు తాజాగా హోలీ పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న తన నివాసంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతోనూ కలిసి నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనమరాళ్లను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. అనంతరం బ్యాండ్ వాయిస్తూ చిన్నారుల్లో ఉత్సాహం నింపారు. మల్లారెడ్డి బీట్‌కు తగ్గ స్టెప్లు వేస్తూ హుషారుగా గడిపారు.
దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని మాజీమంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. తన చిన్ననాటి నుంచి హోలీ సంబురాలు గొప్పగా జరుపుకుంటూ సందడి చేస్తామని తెలిపారు. రాబోయే సంవత్సరం తమ దంపతుల 50వ గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతామని వెల్లడించారు. దేశ ప్రజలంతా సంతోషంగా హోలీ జరుపుకోవాలని తెలిపారు.

Category
🗞
News