• 7 years ago
AP Govt has given special permissions to Jai Simha. The Movie will be played from 1 AM to 10 AM too along with regular shows from Jan 12thto Jan 16th.

సంక్రాంతి రేసులో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానులు దాన్నో ఛాలెంజ్ లాగే తీసుకుంటారు. గెలుపు మా హీరోదంటే మా హీరోదేనని వాదించుకుంటారు.
చివరాఖరికి బొమ్మ పడితే కానీ ఎందులో మేటర్ ఎంతనేది తేలదు.
సినిమా హిట్టా.. ఫట్టా.. అన్నది డిసైడ్ చేసేది ఫైనల్ గా కలెక్షన్లే కాబట్టి.. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. ఏపీలో అదనపు 'షో'ల విషయంలో 'జైసింహా' కన్నా 'అజ్ఞాతవాసి'కే ఎక్కువ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.
జనవరి 10న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10వ తేదీ నుండి 17 వరకు.. మొత్తంగా 8 రోజులు ఈ చిత్ర అదనపు షోల కోసం ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట నుంచి ఉదయం 10గం. వరకు ఎన్ని 'షో'లైనా వేసుకోవచ్చు.
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా 'జైసింహా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అదనపు 'షో'ల కోసం ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. ఐదు రోజులకే దాన్ని పరిమితం చేసింది. 'అజ్ఞాతవాసి'కి 8రోజులు అనుమతిచ్చిన ప్రభుత్వం.. జైసింహాకు మాత్రం ఐదు రోజులే అనుమతివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Recommended