Pawan Kalyan performed Bhoomi Puja for his new house which is going to be constructed at Khaja, in Guntur district. along with him his wife Anna Lezhneva also performed the pooja. After The Pooja, Pawan Kalyan said on March 14 that he would make a key announcement at a public meeting to be held at Nagarjuna University.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజలో సొంత ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు, తన సతీమణితో కలిసి ఆయన పూజ చేశారు. అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
ఇంటితో పాటు వ్యక్తిగత కార్యాలయం ఇందులో ఉండనుందని, భవిష్యత్తులో దీన్ని పార్టీ కార్యాలయంగానూ వినియోగించుకునే అవకాశముందని అంటున్నారు
కాగా, పవన్ సొంతిల్లు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. చుట్టూ 8 అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణంగా ఉండే ఈ భవనంలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచి పెట్టనున్నారని సమాచారం.మొత్తం మూడు అంతస్తుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పని వారి కోసం నివాసం గదులు ఉంటాయని తెలుస్తోంది.ఆ తర్వాత ఫ్లోర్‌లో మరో చిన్న సమావేశపు మందిరంతో పాటు వంటగది, డైనింగ్ హాల్, బెడ్రూంలు తదితరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. తర్వాత అంతస్తులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి మిగతా స్థలాన్ని ఖాళీగానే ఉంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో 14న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు. సభావేదిక ఎక్కి ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతపురం, కాకినాడ సభ అనంతరం జరిగిన అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ పునరావృతం కానివ్వొద్దని నేతలకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

Category
🗞
News