వేషాల కోసం పడకగదికి.. అది నాకు తప్పలేదు..

  • 7 years ago
Priyanka Chopra Said I have faced and thrown out of films for someone’s girlfriend. Priyanka Chopra said men also faced casting couch. I have been thrown out of films because someone else was recommended... A girlfriend was recommended after I was signed for a movie.

వేషాల కోసం పడకగది (క్యాస్టింగ్ కౌచ్)కి రమ్మనే దుష్ట సంస్కృతిపై ఒక్కొక్కరే పెదవి విప్పుతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టెన్ ఉదంతం బయట ప్రపంచానికి వెలుగు చూసిన తర్వాత ఈ తరహా కథనాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా షాకింగ్ విషయాలను వెల్లడించడంతో సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పెంగ్విన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. తనకు లైంగిక, బంధుప్రీతి వేధింపులు తప్పలేదు అని చెప్పింది.
వేషాల కోసం నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు చాలా భయమేసేది. నిర్మాతల గదిలోకి బిక్కు బిక్కు మంటూ వెళ్లేదానిని. నా సినీ కెరీర్ ఆరంభంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది.
ఓ సందర్భంలో నాకు ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. కానీ నన్ను ఆ సినిమా నుంచి తప్పించి తన గర్ల్‌ఫ్రెండ్ సిఫారసు చేసిన ఓ హీరోయిన్‌ను తీసుకొన్నారు. ఇదోరకమైన వేధింపులు సినీ పరిశ్రమలో ఎక్కువగానే ఉంటాయి. దర్శకులు చెప్పారని, నిర్మాత బంధువులు సూచించారన్న కారణంతో నన్ను చాలా సార్లు సినిమాల నుంచి తప్పించారు.
అప్పట్లో అలాంటి పరిస్థితులను ఎదురించే శక్తి లేకపోయింది. చివరి నిమిషంలో తప్పించినన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
సినీ పరిశ్రమలో ప్రతికూల పరిస్థితులను ఎదురించే ధైర్యం నా కుటుంబ నేపథ్యం వల్ల ఏర్పడింది. నా కుటుంబం నుంచి నాకు మంచి సపోర్ట్ ఉండటం వల్ల నేను ఈ స్థాయికి చేరుకొన్నాను అని ప్రియాంక వెల్లడించింది.

Category

People

Recommended