Vijayawada:BJP MLC Madhav has expressed doubts over TTD latest affairs would be suspected to be something wrong.
#AndhraPradesh
#Vijayawada
#BJPMLCMadhav
#BelgiumDiamond
టిటిడి పవిత్రతను టీడీపీ మంటగలుపుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. మంగళవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ నాయకులు, అధికారులు వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులును విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగేవుంటుందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని మాధవ్ ధ్వజమెత్తారు. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని మాధవ్ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆభరణాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆభరణాలన్నీ బహిర్గతం చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని...అయితే ఆయనే స్వయంగా వాటిని చూసి చెబుతన్నారా?...లేదా ఇలా చెప్పమంటూ ఎవరైనా ఆయనను ప్రభావితం చేస్తున్నారా అనేది సందేహంగా ఉందన్నారు. బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం నుంచి వివరణ కోరాల్సిన అవసరం ఉందనేది తన అభిప్రాయమన్నారు. అలాచేస్తే ఆ వజ్రం ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహం తీరిపోతుందని చెప్పారు.
టిటిడి ఛైర్మన్ గా అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తిని నియమించారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడిలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని...అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు.

Category
🗞
News