• 7 years ago
There is no denying that the Badshah of Bollywood - Shah Rukh Khan - is the ultimate king of romance and his films have influenced our love life greatly.

వెండితెరపై 2.30గం. సినిమా చూసొచ్చాక.. అది దమ్మున్న సినిమా గనుక అయితే.. ఆ ప్రభావం కచ్చితంగా కొద్దిసేపు వెంటాడుతుంది. కొన్నిసార్లు కొద్దిరోజులు కూడా వెంటాడవచ్చు. కానీ ఓ యువతిని మాత్రం జీవితాంతం ఆ ఫీలింగ్ వెంటాడుతూ వస్తోందట. సిల్వర్ స్క్రీన్ పై ఓ హీరో చేసిన మాయకు.. ఫుల్లుగా ఫిదా అయిపోయిన ఆమె.. చేసుకుంటే అలాంటి వాన్నే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయిందట.
దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే'.. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో కాజోల్-షారుఖ్ మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు. పశ్చిమ్‌ బంగాకు చెందిన ఓ యువతి ఆ సినిమా చూశాక షారుక్ ఆమె డ్రీమ్ హీరో అయిపోయాడు. దీంతొ చేసుకుంటే అలాంటివాన్నే పెళ్లి చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయిపోయింది.
అచ్చు 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో లాగా.. తనకూ ఓ అబ్బాయి అలాగే ప్రపోజ్ చేయాలని ఆమె నిత్యం కలలు కనేది. ఇదే క్రమంలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. కానీ, అతను షారుక్‌ ఖాన్‌ స్టైల్లో ప్రపోజ్‌ చేయలేదు. దీంతో కొంతకాలం వేచి చూసింది. అయినా లాభం లేకపోయేసరికి.. ఇక తానే షారుక్ ఖాన్ కావాలని నిర్ణయించుకుంది.
షారుక్‌ ఖాన్‌ నా జీవితాన్ని నాశనం చేశాడు. చిన్నప్పటి నుంచి నాకు కాబోయే వాడు పర్‌ఫెక్ట్‌గా షారుక్ లాగే ఉండాలని కలలు గన్నాను.
మా ఇద్దరికి పరిచయం ఏర్పడిన తొలినాళ్లలో.. మేం మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్‌కి తనని రమ్మని చెప్పాను. అతను రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టకముందే.. ముందుగా చేసిన వయోలిన్ మ్యూజిక్, డీజే స్టార్ట్ అయ్యాయి. ఆపై అతని ముందు నేను మోకాళ్లపై కూర్చొని.. ఇకనుంచి నా జీవితంలోని సంతోషాల్ని, నవ్వుల్ని, బాధల్ని.. ఇలా ప్రతీ క్షణాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?.. అంటూ దిల్ వాలే సినిమాలో లాగా షారుక్ స్టైల్లో ప్రపోజ్ చేశాను.

Category

🗞
News

Recommended