థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లల్లో సహాయక సిబ్బంది ఆరుగురిని రక్షించింది. ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆరుగురు బయటపడ్డారు. ఆదివారం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.ఆరుగురు పిల్లలు వెలుపలకు సురక్షితంగా వచ్చారు. వారికి వైద్య సేవలు అందించేందుకు గుహ బయట ఫీల్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారిని కాపాడేందుకు వివిధ రకాలుగా ఆలోచనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈత నేర్పి తీసుకు రావడం, స్పేస్ ఎక్స్ అండ్ బోరింగ్ కంపెనీ అధినేత ఎలోన్ ముస్క్ ఓ ప్లాన్ చెప్పారు. మరోవైపు నీటిని తోడుతున్నారు.గుహలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుందనే ఆందోళనతో వారిని రక్షించేందుకు మరోవైపు కొండలను కూడా తొలుస్తున్నారు. గుహ పైభాగాన వంద చోట్ల రంధ్రాలు చేశారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల మేర తవ్వినా వారి జాడ కనిపించలేదు. కొండ పైభాగం నుంచి 600 మీటర్ల కంటే లోతులో వారు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
Category
🗞
News