ఏపి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ వ్యవహారం శ్రుతిమించుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు అన్నిశాఖల్లో జోక్యం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న లోకేష్., తాజాగా సంప్రదాయలను పక్కన పెట్టి రాబోవు ఎన్నికల అభ్యర్థులను కూడా ఏకపక్షంగా ప్రకటించే స్థాయికి ఎదిగారని నేతలు చర్చించుకుంటున్నారు. పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయం తెలుసుకోకపోవడంతో పాటు., పార్టీ అంతర్గత వ్యవహారాల్లో లోకేష్ కలుగజేసుకుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కర్నూలు వేదికగా తనకు అనుకూలంగా ఉండే నాయకత్వాన్ని లోకేష్ సిద్దం చేసుకుంటున్నారనే చర్చలు కూడా మొదలయ్యాయి
తెలుగుదేశం పార్టీలో లోకేష్ మాటే ఫైనల్ అన్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కూడా పార్టీ సీనియర్ నేతలు తన వద్ద ఏదైనా అంశాలను ప్రస్తావిస్తే లోకేష్ కు ఓ మాట చెప్పండని వ్యాఖ్యానిస్తున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే మొన్న కర్నూలులో లోకేష్ చేసిన అభ్యర్ధుల ప్రకటన పార్టీ నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా..ఇక టిక్కెట్లు కావాలని కోరుకునే వారంతా చంద్రబాబును వదిలేసి..లోకేష్ చుట్టూ చేరటం ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే అతి పెద్ద ‘పవర్ సెంటర్'గా మారిన లోకేష్..రాబోయే రోజుల్లో మరింత ‘కేంద్రీకృత' వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
in ap politics cm chandrababu son, minister lokesh became trump card. few days back he announced two contested seats in kurnool district. criticism raised against the lokesh decision in the same party.
#chandrababu

Category
🗞
News