• 7 years ago
RSS interfear in the AP Government affairs that particularly it objects that appointment to be Sudhakar Yadav as of TTD Chairman. Because he has links with Cristian communities. But AP Intellegence report dismissed this allegations.

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ నియామకం విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మోకాలడ్డు పెట్టినట్లు తెలుస్తోంది. కడపజిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాకర్‌ యాదవ్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, సుధాకర్‌ నియామకాన్ని అడ్డుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయించినట్లు సమాచారం. సుధాకర్‌ యాదవ్‌కు క్రైస్తవ సంఘాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తిని ఇంత ముఖ్యమైన దేవాలయ చైర్మన్‌గా నియమించడం సరికాదని ఆ సంఘ నాయకత్వం వాదిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి జోక్యం చేసుకోవడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ అభిప్రాయాన్ని కాదని ప్రభుత్వం ముందుకెళితే.. దేవాదాయశాఖ మంత్రిగా మాణిక్యాల రావుతో రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
సుధాకర్‌ యాదవ్‌ కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. మైదుకూరులో ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం... సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. చైర్మన్‌గా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చిన తర్వాత మైదుకూరు అసెంబ్లీ స్థానం పరిధిలో పెట్టిన కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

Category

🗞
News

Recommended