• 8 years ago
Bharat Ane Nenu focuses on many burning issues that are grappling the modern-day society. Among many issues that are showcased in the film, education system is said have given thorough importance.

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా కనిపించ‌నున్నాడు.
స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా యూనిట్. ఇందులో మహేష్ బాబు సీఎం‌గా కనిపించబోతున్నాడన్న విషయమే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
అయితే ఈ సినిమా విషయం లో వినిపిస్తున్న వార్త ఒకటి ఆసక్తి కరంగా ఉంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ ఒకటి సినిమా స్థాయిని పెంచేస్తుందట.
రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల ప్రస్తావన ఉంటుందట. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ కి సంబందించిన సీన్స్ సినిమాకి ప్రధాన బలమని చెబుతున్నారు.

Recommended