• 8 years ago
Hyderabad High Court rejected Andhrajyothy MD Vemuri Radhakrishna's quash petition. Court ordered him to attend on Dec 5th.

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హాజరు కాలేనంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. క్వాష్ పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో ఎండీ రాధాకృష్ణతో పాటు ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ సహా మరికొంతమంది ఉద్యోగులు విచారణకు హాజరుకావాల్సిందే. ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా వీరెవరూ నాంపల్లి కోర్టుకు హాజరుకాకపోవడం.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిన సంగతే.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు రాలేకపోతున్నామంటూ రాధాకృష్ణ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం దీన్ని తప్పుపట్టింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఆదేశించింది.ఈ ఏడాది మే నెలలో ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైసీపీ అధినేత జగన్ కలిశారు.
భేటీకి సంబంధించి మరునాడు వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించిందని వైసీపీ ఆరోపించింది. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. కోర్టుకు స్వయంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

Category

🗞
News

Recommended