• 7 years ago
మనకందరికీ నచ్చిన ఫేవరెట్ డిష్ లలో ఎక్కువ ఇష్టమైనది మరియు అతి త్వరగా తయారుచేసుకొనే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్. ముఖ్యంగా ఎగ్ వెజిటేబుల్ ఫైడ్ రైస్ చాలా సులభంగా, అతి త్వరగా మరియు టేస్టీగా పూర్తి న్యూట్రీషియన్స్ తో తయారయ్యే వంట ఎగ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అయితే ఎప్పుడూ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎగ్ మరియు వెజిటేబుల్స్ మిక్స్ చేసి తయారు చేసుకోవచ్చు. వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అతి త్వరగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకొనే వంటకం. ఇది బ్రేక్ ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నభోజనం లేదా డిన్నర్ లోనూ తినవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లకు తయారు చేసి ఇవ్వొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. వర్షాకాలంలో అయితే మరింత రుచిగా... కారంగా తయారు చేసుకొని తినవచ్చు. గుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఎగ్ తినడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొన్నట్లైతే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. గుడ్డును ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ‘ఐ'సైట్ ను తగ్గించి కొవ్వు పెరగకుండా నిరోదిస్తుంది. ఇందులో విటమిన్ బి మరియు విటమిన్ డి మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

Recommended